Thursday, April 25, 2024

దాస్​ కా ధమ్కీ.. మాస్​ మూవీతో వస్తున్న విశ్వక్​సేన్​

విశ్వక్‌ సేన్‌ తను -టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’. ఈ మూవీని కరాటే రాజు నిర్మిసుండగా.. పాగల్ చిత్రంతో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న నివేదా పేతురాజ్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక విశ్వక్ సేన్ ఈ ఏడాది మంచి ఊపు మీదే ఉన్నాడు.. ఇప్పటికే అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరీ దేవుడా లాంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్.. ఇప్పుడు దాస్ కా ధమ్కీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కినట్లు ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. రెండు రకాల విభిన్న గెటప్పుల్లో విశ్వక్ కనిపిస్తున్నాడు. ఇందులో ఓ రోల్ పూర్తిగా ప్రతినాయకుడి ఛాయలు ఉంటాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.

‘దాస్‌ కా ధమ్కీ’ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. వినోదంతో పాటు భారీ యాక్షన్‌ కూడా వుంటుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. బల్గేరియన్‌ ఫైట్‌ మాస్టర్స్‌ టోడర్‌ లాజరోవ్‌ – జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ను చిత్రీకరించారు. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌కు కొరియాగ్రఫీ చేయగా వెంకట్‌ మాస్టర్‌ స్టైలిష్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ను పర్యవేక్షించారు. ఫిబ్రవరి, 2023లో విడుదల కానుంది.

- Advertisement -

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement