Wednesday, March 22, 2023

దాస్ కా ధ‌మ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్… గెస్ట్ గా ఎన్టీఆర్

హీరో విశ్వ‌క్ సేన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం దాస్ కా ధ‌మ్కీ..హీరోయిన్ గా నివేదా పేతురాజ్ న‌టిస్తోంది.ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. కాగా దాస్ కా ధ‌మ్కీ ప్రీ రిలీజ్ ఈవెంటుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు – శిల్పకళా వేదికలో జరగనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.
ఈ వేడుకకి చీఫ్ గెస్టుగా స్టార్ హీరో ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. తరుణ్ భాస్కర్ .. పృథ్వీ .. రోహిణి కనిపించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement