Friday, December 6, 2024

బ్యాక్ టూ వ‌ర్క్‌, షూటింగ్‌లో డార్లింగ్ బిజీ బిజీ.. ఆగ‌స్టులో మారుతితో మ‌రో మూవీ!

డార్లింగ్‌ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో తీరిక లేకుండా షూటింగ్‌ల‌లో పాల్గొంటున్నారు. అయితే.. ప్ర‌భాస్ త‌న మోకాలు స‌ర్జ‌రీ కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నట్టు సినీ వ‌ర్గాలు తెలిపాయి. గాయం త‌గ్గ‌డంతో ఇటీవ‌లే ‘ప్రాజెక్ట్‌-K’ షూటింగ్‌లో మ‌ళ్లీ జాయిన్ అయ్యారు. ఈ షెడ్యుల్ పూర్త‌వ్వ‌గానే ‘స‌లార్’ బిగ్ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు.

కాగా, ప్ర‌భాస్ మారుతి కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. తాజ‌గా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ చ‌క్క‌ర్లు కొడుత్తోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ మూవీ షూటింగ్ ఆగ‌స్టులో ప్రారంభించ‌నున్నారు. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళ‌వికా మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీ కోసం హైద‌రాబాద్‌లో ఒక పెద్ద బంగ్లా సెట్‌ను వేశార‌ని టాక్. మొద‌టి షెడ్యుల్‌లో ప్ర‌భాస్‌, మ‌ళ‌వికా మ‌ధ్య స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement