Sunday, April 14, 2024

డేంజరస్.. డిసెంబర్ 9న రిలీజ్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ..దర్శకత్వంలో కంపెనీ పతాకంపై తెరకెక్కింది డేంజరస్ చిత్రం. మా ఇష్టం అన్నది ఉప శీర్షిక. తాజాగా మరోసారి ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు రాంగోపాల్ వర్మ. మరి ఈసారైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ చిత్రం విడుదల అవుతుందో లేదో వేచి చూడాలి. ఈ చిత్రంలో అందాల తారలు నైనా గంగూలి, అప్సర రాణి హీరోయిన్లుగా నటించగా.. ముఖ్య పాత్రలలో రాజ్ పాల్ యాదవ్, మిథున్ పురంధర్ కనిపిస్తారు. అయితే గతంలోనే విడుదల కావలసిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విడుదల వాయిదా వేయక తప్పలేదు. లెస్బియన్ సబ్జెక్టు వల్ల చాలా థియేటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రాలేదు. దాంతో ఈ సినిమా విడుదలను గతంలో వాయిదా వేశారు రాంగోపాల్ వర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement