Thursday, March 28, 2024

ధ‌మాకా నుండి.. ఫోర్త్ సింగిల్ ప్రోమో రిలీజ్

ధ‌మాకా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు త్రినాథ్ రావు న‌క్కిన‌. ఈ మూవీలో మాస్‌ మహరాజా రవితేజ న‌టిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 23న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజ‌వాడ క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో బాణీలు సమకూర్చారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాలోని ‘దండకడియాల్‌’ సాంగ్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు. లేటెస్ట్‌గా రిలీజైన ఫోర్త్‌ సింగిల్‌ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఈ పాట ఫుల్‌ సాంగ్‌ త్వరలో రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇది వరకే విడుదలైన జింతాక్‌, మాస్‌రాజా, వాట్స్ హప్పెనింగ్‌ సాంగ్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే హైయెస్ట్‌ బడ్జెట్‌తో రూపొందింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement