Saturday, April 20, 2024

ప్ర‌స్తుతానికి అది సస్పెన్స్…దక్షా నాగర్కర్‌

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌ వర్మ దర్శకుడు. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని అభిషేక్‌ నామా, రవితేజ నిర్మిసున్నారు. ఏప్రిల్‌ 7న విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక దక్షా నాగర్కర్‌ మీడియాతో ‘రావణాసుర’ విశేషాలని పంచుకున్నారు.
మీకు రావణాసుర సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
నిర్మాతే తొలుత సంప్రదించారు. ఇందులో పాత్ర లుక్‌ గురించి చెప్పారు. చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారి సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.


ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటు-ంది ?
నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పకూడదు. ప్రస్తుతానికి అది సస్పెన్స్‌. నటన విషయానికి వస్తే.. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలో నటించాను అని చెప్పగలను.
ఈ తరహా -కై-మ్‌ థ్రిల్లర్‌ చేయడం మీకు కొత్త కదా ?
అవును. నేను ఎప్పుడూ కొత్తదనంగా ఉంటే పాత్రలు చేయా లనిప్రయత్నిస్తాను. హోరాహోరిలో మెంటల్‌ డిస్టర్బ్‌ గా వుండే అమ్మాయి గా చేశాను. హుషారు లో దిల్‌ చహతహే తరహ పాత్ర, అలాగే జాంబిరెడ్డి తెలుగు లో మొదటి జాంబి ఫిల్మ్‌. రావణాసుర కూడా చాలా డిఫరెంట్‌ మూవీ.

దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ కథని చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు ?
సుధీర్‌ వర్మ గారు రావణాసుర కథని కలర్‌ పేలేట్‌ తో సహా ఎలా వుంటు-ందో చెప్పారు. ఆయన చెబుతున్నపుడే ఒక సినిమా చూసిన అనుభూతి కలిగింది.
ఇందులో చాలా మంది హీరోయిన్స్‌ వున్నారు కదా.. మీ పాత్రకు ఎంత ప్రాధాన్యత వుంటు-ందో అనే సందేహం రాలేదా ?
నాకు అలా ఏం అనిపించలేదు. నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రని ఎంత న్యాయం చేయగలనో అనే దానిపైనే దృష్టిపెట్టాను.
రవితేజ లాంటి పెద్ద స్టార్‌ తో పని చేయడం ఎలా అనిపించిది ?
రవితేజ గారు బిగ్‌ స్టార్‌, మాస్‌ మహారాజా. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. చాలా హంబుల్‌ గా వుంటారు. సెట్స్‌ లో చాలా సరదా వుంటారు. ఆయనతో వర్క్‌ చేయడం మంచి అనుభవం.
రావణాసుర బలాలు ఏమిటి ?
రవితేజ గారు, దర్శకుడు సుధీర్‌ వర్మ, సుశాంత్‌, డీవోపీ, మా -టె-క్నికల్‌ టీ-ం ఇలా అందరం కష్టపడి ది బెస్ట్‌ ఇచ్చాం.
ఎలాంటి పాత్రలలో కనిపించాలని వుంది ?
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటు-ంది. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. చాలా నేర్చుకోవాలి. అందరి హీరోలతో కలసి పని చేయాలని వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement