Sunday, March 26, 2023

ఆత్మహత్యల్లో డైలీ లేబర్, ప్రతి నలుగురిలో ఒక కూలీ మృతి.. నేషనల్​ క్రైమ్​ బ్యూరో రికార్డ్స్​ వెల్లడి

దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన తొమ్మిది మంది ప్రొఫెషనల్స్‌లో అత్యధిక శాతం మంది డైలీ లేబర్‌ ఉన్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) వెల్లడించింది. దేశంలో దినసరి కూలీల ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉందని ప్రకటించింది, 2021లో 1,64,033 ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందులో ప్రతి నలుగురిలో ఒకరు డైలీ లేబర్‌ అని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) స్పష్టం చేసింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఇండియాలో జరిగిన యాక్సిడెంట్‌ మరణాలు, ఆత్మహత్యల్లో అధిక శాతం మరణాలు దినసరి వేతన కూలీలవే. గతేడాది దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడగా, వారిలో 25.6శాతం అనగా, 42,004 మంది వేతన కూలీలని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బి కేటగిరీలో తొమ్మిది ప్రొఫెషనల్‌ గ్రూపులు – విద్యార్థులు, ప్రొఫెన ల్‌ లేదా వేతన ఉద్యోగులు, దినసరి కూలీలు, రిటైర్డ్‌ వ్యక్తులు, నిరుద్యోగులు, సెల్ఫ్‌ ఎంప్లాయీస్‌, గృహిణులు, వ్యవసాయరంగం, ఇతరులను చేర్చింది.

ఒక్క 2021లోనే కాకుండా 2020లో సైతం ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో డైలీ కూలీల సంఖ్యే అధికంగా ఉంది. 2020లో 1,53,052 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో రోజు కూలీల వాటా 24.6 శాతం అనగా, 37,666 మంది ఉన్నారని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడించాయి. ఇది జాతీయ సగటు ఆత్మహత్యల రేటు కంటే ఎక్కువగా ఉంది. 2020తో పోలిస్తే, 2021లో జాతీయస్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి శాతం 7.17 శాతం పెరిగి 1,64,033గా నమోదయింది. ఇది జాతీయస్థాయిలో అత్యధిక శాతం నమోదైన ఆత్మహత్యల రేటు. 2020లో 1,53,052 ఆత్మహత్యల కేసులు నమోదయ్యాయి. ఎన్‌సీఆర్‌బీ కేటగిరిలోని తొమ్మిది వర్గాల గ్రూపులో, డైలీ లేబర్‌ గ్రూపు ఆత్మహత్యల శాతం గతేడాదితో పోలిస్తే, 11.52 శాతం పెరిగింది.

- Advertisement -
   

2020లో ఆత్మహత్యలకు పాల్పడిన రోజు కూలీల సంఖ్య 37,666 ఉండగా, ఆ సంఖ్య 2021కు 42,004కు పెరిగింది. డెయిలీ లేబర్‌ తర్వాత తొమ్మిది కేటగిరీల్లో అత్యధిక శాతం ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ వ్యక్తుల శాతం ఎక్కువగా ఉంది. 2021లో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య మొత్తం ఆత్మహత్యల్లో16.73 శాతం నమోదయింది. 2020లో ఆత్మహత్యలకు పాల్పడిన సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ వ్యక్తుల సంఖ్య 17,332 ఉండగా, 2021లో ఆ సంఖ్య 20,231కు పెరిగింది. ఏడాది క్రితం 11.3శాతం నమోదయిన సెల్ఫ్‌ ఎంప్లాయాస్‌ ఆత్మహత్యలు, ప్రస్తుతం ఆ సంఖ్య 12.3శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement