Thursday, June 8, 2023

విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ విడుదల.. వచ్చే నెల వేతనాలతో కలిపి చెల్లింపు

అమరావతి, ఆంధ్రప్రభ : విద్యుత్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఉన్న డీఏకు అదనంగా 2.97 శాతం మేరపెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంగళవారం ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. విద్యుత్‌ ఉద్యోగులకు 2022 జనవరి డీఏలు చెల్లించాల్సి ఉంది. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వంతున ఈ డీఏల చెల్లింపు ఉంటుంది. 2022 జనవరి, 2022 డిసెంబరు, 2023 జనవరి కలిపి మొత్తం మూడు డీఏలు బకాలున్నాయి. అందులో భాగంగా మంగళవారం 2022 జనవరికి సంబంధించి 2.97 శాతం మేర పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు.

- Advertisement -
   

ప్రస్తుతం 22.02 శాతం మేర విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ అందుతోంది. మంగళవారం పెంచిన 2.97 శాతం కలుపుకుంటే ఈ డీఏ మొత్తం 24.99 శాతానికి పెరగనుంది. అయితే, ఈ పెంచిన డీఏను ఫిబ్రవరి నెల జీతంతో కలిపి ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ పెండింగ్‌ డీఏకు సంబంధించి ఇప్పటివరకూ మొత్తం 13 నెలల ఎరియర్స్‌ రావల్సి ఉంది. ఈ మొత్తాన్ని తరువాత చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement