Tuesday, April 23, 2024

ముంచుకొస్తున్న ‘యాస్‌’ తుఫాను!

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్టే తుఫాన్’ బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో ముప్పు దూసుకు రాబోతున్నది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది.  ఈ అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.   ఈ తుఫానుకు ‘యాస్’ అనే పేరుపెట్టారు.  ఈ యాస్ తుఫాను ఈనెల 26 నుంచి 27 మధ్య  వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా-బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కాగా, ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్టే తుఫాన్’ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ తుఫాను ధాటికి పశ్చిమ తీర ప్రాంతం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి.  వేల కోట్ల రూపాయల నష్టం సంభవించిన సంగతి తెసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement