Friday, April 19, 2024

పవన్‌కు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపిన సైబరాబాద్ పోలీసులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. సైబరాబాద్ పోలీసులు కూడా పవర్ స్టార్‌కు వినూత్నంగా సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వకీల్ సాబ్ సినిమాలోని ఓ పోస్టర్‌తో ఓ డైలాగును క్రియేట్ చేసి సైబరాబాద్ పోలీసులు అటు వాహనదారులకు సున్నితంగా హెచ్చరిస్తూ ఇటు పవన్‌కు ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు.

ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ‘కాళ్ల కింద యాక్సిలేటర్ ఉంది కదా అని తొక్కితే రూల్సే కాదు బోన్స్ కూడా బ్రేక్ అవుతాయి’ అని ఉంది. డునాట్ ఓవర్ స్పీడ్ అని పోలీసులు పోస్టులో పేర్కొన్నారు. వాహనదారులను పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నట్లు ఈ ఫోటోను సైబరాబాద్ పోలీసులు తయారుచేశారు. కాగా ఈ పోస్టును చూసిన నెటిజన్లు పోలీసులు తెలివిని మెచ్చుకుంటున్నారు.

https://twitter.com/cyberabadpolice/status/1433323036304834564
Advertisement

తాజా వార్తలు

Advertisement