Thursday, May 26, 2022

‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ పై నటుడు సీవీఎల్ సంచలన వ్యాఖ్య

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న సీనియర్ నటుడు నటుడు సీ వి ఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని పిలుపునిచ్చారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించాలని కోరారు. దేశం అన్నా దేవుడు అన్నా చులకన భావం వున్న ప్రకాష్ రాజ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేకుండా వుంటే బాగుంటుందని తెలిపారు. ప్రకాష్ రాజ్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని ఆశిస్తున్నట్లు సీవీఎల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement