Tuesday, March 28, 2023

ఆక‌ట్టుకుంటోన్న.. క‌స్ట‌డీ టీజ‌ర్

శ్రీనివాస చిట్టూరి నిర్మించిన‌చిత్రం క‌స్ట‌డీ. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాడు..ఈ చిత్రంలో హీరో నాగ‌చైత‌న్య న‌టించాడు. మే 12 వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. ‘ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది .. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు. నిజం ఒక ధైర్యం .. నిజం ఒక సైన్యం .. అది ఇప్పుడు నా కస్టడీలో ఉంది’ అనే హీరో డైలాగ్ సినిమాపై ఆత్రుతను పెంచుతోంది. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం.చైతూకి జోడీగా కృతి శెట్టి అలరించనుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement