Tuesday, April 16, 2024

క‌స్ట‌డీ రిలీజ్ అప్పుడే..

అక్కినేని నాగచైతన్య, వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌ సినిమా కస్టడీ. తెలుగు- తమిళ ద్విభాషల్లో రూపొందుతోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారంతో పూర్తయింది.
దీనికి సంబధించిన వీడియోని టీ-ం పంచుకుంది. దర్శకుడు వెంకట్‌ ప్రభు కట్‌ చెప్పి ”చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల” అని చెప్పగా ”మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్‌ లో కలుద్దాం” అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ఆకట్టు-కుంది.


ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్‌ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించనుంది. సంపత్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, ప్రేమ్‌ జీ, వెన్నెల కిషోర్‌, ప్రేమి విశ్వనాథ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ‘కస్టడీ’ ఒకటి. ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
పవన్‌కుమార్‌ సమర్పిసు ్తన్నారు. అబ్బూరి రవి సంభాషణలు రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement