Wednesday, April 24, 2024

అనంతగిరిలో పర్యాటకుల సందడి…

వికారాబాద్‌ టౌన్‌,(ప్రభ న్యూస్‌): ఇటీవల కురిసిన బారీ వర్షాలకు అనంతగిరిలో వాటర్‌ ఫాల్స్ ఉన్నాయన్న సమాచారంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంది. వర్షాకాలంలో ఈ వాటర్‌ ఫాల్స్‌ రావటం సాధారణం.. కాగా ఈ దఫా బారీగా కురిసిన వర్షాల కారణంగా నయాగరా జలపాతాన్ని తలపించేలా వాటర్‌ ఫాల్స్‌ పడుతున్నాయి. అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం అవతలి వైపు తాండూర్‌ వెల్లే మార్గంలో నంది గాట్‌ వద్ద నుండి వెలితే ఈ వాటర్‌ ఫాల్స్‌ కనిపిస్తాయి. దీంతో అనంతగిరిలో వాటర్‌ ఫాల్స్‌ ఉన్నాయన్న సమాచారంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అధికం అయింది.

అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న వారు ఈ వాటర్‌ ఫాల్స్‌ను, నంది ఘాట్‌ను సందర్శించటంతో పాటు సమీపంలోని కోట్‌ పల్లి ప్రాజెక్ట్‌, బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని వెలుతున్నారు. మొత్తం మీద అనంతగిరి వాటర్‌ ఫాల్స్‌ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement