Monday, September 20, 2021

ఏపీలో టిఫిన్ హోటల్‌కు రూ.21 కోట్ల కరెంట్ బిల్లు

పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో ఓ టిఫిన్ హోటల్‌కు వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఆ కరెంటు బిల్లు చూసిన టిఫిన్ హోటల్ నిర్వాహకురాలి పరిస్థితి కూడా ఇదే. సెప్టెంబరు నెలకు సంబంధించి రూ.21 కోట్ల మేర బిల్లు వేశారు. దాంతో ఆమె లబోదిబోమన్నారు.

వెంటనే ఈ సంగతి విద్యుత్ శాఖ అధికారులకు నివేదించడంతో వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆమె బిల్లును సరిచేసి కొత్త బిల్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు భరోసా ఇచ్చిన తర్వాత గానీ ఆమె కుదుటపడలేదు. ఈ బిల్లు తీయడంలో నిర్లక్ష్యం వహించాడంటూ చింతలపూడి మీటర్ రీడింగ్ ఉద్యోగి ప్రభాకర్ తో పాటు ఆ ప్రాంత ఏఈపైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సాంకేతికలోపం కారణంగానే ఇలాంటి బిల్లులు వస్తుంటాయని అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News