Thursday, May 26, 2022

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ – ఏసిపి సారంగపాణి

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వస్తాయని పెద్దపల్లి ఏసిపి పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసందుకు మానస మెడికల్స్ యజమాని వెల్లంకి సతీష్ కుమార్ పోలీస్‌ శాఖకు సీసీ కెమెరాలను అందజేశారు. ఈసందర్భంగా ఏసిపి మాట్లాడుతూ రోజు రోజుకు జనాభా పెరిగిపోతుందని, పట్టణంలోని ప్రధాన రహదారులతోపాటు కాలనీలలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి రావడంతోపాటు నేర చేధనకు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. పట్టణంలోని వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్వచ్ఛంద సేవా సంఘాలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ఈకార్యక్రమంలో సిఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐలు రాజేశ్‌, రాజ వర్ధన్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement