Wednesday, March 27, 2024

ట్రెండ్ మారినా …. క్రేజ్ త‌గ్గ‌ని హీరోయిన్స్…

స్టార్స్‌ సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర నామ మాత్ర మే. పాటల్లో డాన్స్‌ చేయడం, గ్లామర్‌ ప్రదర్శించడ మే. కానీ కొన్ని సినిమాల్లో దీనికి భిన్నంగా ఉంటోంది. హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇస్తున్నారు. కథల్లో భాగస్వామిని చేస్తున్నారు. విజయాల్లో పాలు పంచుకునేలా చూస్తున్నారు. ఈ మార్పువల్ల అనేక మంది నాయికలకు అవకాశాలు దొరుకుతున్నా యి. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా వేషా లు వరిస్తున్నాయి. ఒకవైపు ముంబై నుండి నాయికలు దిగుమతి అవుతూనే ఉ న్నారు. మరోవైపు ఆల్‌రెడీ పాతుకుపోయిన నాయికలకు క్రేజ్‌ తగ్గడం లేదు. సీనియర్‌ నాయికలం దరూ బిజీ బిజీగా ఉన్నారు. వీరితో పాటుగా వర్ధమాన నాయికలు సైతం తలా రెండుకు తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు. ఇది ఆహ్వానంచదగిన పరిణామంగా చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
గతంలో ఫ్లాప్‌ సినిమాలో నటించిన నాయికలు అవకాశాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు -టె-ండ్‌ మా రినట్టే కనిపిస్తోంది. భామల కెరీర్‌ పై పరాజయాల ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. ఫ్లాపులున్నప్ప టికీ కొందరు హీరోయిన్లను పిలిచి అవకాశాలిస్తున్నా రు దర్శకనిర్మాతలు.


నాలుగు పరాజయాలు పలకరించినా వచ్చిన ఇబ్బందేం లేదు. కెరీర్‌ ఢోకా ఉండదు. ఇదీ టాలీవుడ్‌ లో కథానాయకుడి వరస. అదే హీరోయిన్‌ విషయాని కొస్తే నటించిన సినిమాల ఫలితంలో తేడా వస్తే ఏకం గా అదృష్టం మారిపోతుంది. ఫ్లాప్‌ కథానాయిక, లేదా ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర పడుతుంది. అలా కనుమరు గైన కథానాయికలు చాలామందే. కానీ ఈ మధ్యకా లంలో -టె-ండు మారినట్టే కనిపిస్తోంది.
వాళ్ల కెరీర్‌పై పరాజ యాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. వరుస ఫెయిల్యూర్‌లు మూటగట్టు- కున్నా.. పిలిచి అవకాశాలిస్తు న్నారు. ఎందు కిలా? అంటే కథానాయికల కొరత అన్నది సమా ధానం. ఇక సీనియర్‌ భామలైతే వాళ్లకున్న అనుభవం, క్రేజ్‌తో కొత్త ప్రాజెక్టులు కొల్ల గొడుతున్నారు.సాయిపల్లవి, కృతి శెట్టి, రాశీఖన్నా తదితర కథా నాయి కలు ఈమధ్య తెలుగులో చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించలే క పోయాయి. అయినా సరే, క్రమం తప్పకుండా అవ కాశాల్ని అందుకుంటూనే ఉన్నారు. ‘ఉప్పెన’ విజ యం తర్వాత కృతిశెట్టికి మళ్లి ఆ స్థాయి విజయం దక్కలేదు. అయినా ఆమె తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీగా ఉంది. ఇక సాయిపల్లవి సినిమా ఒప్పుకొం టే చాలన్నట్టు-గా ఎదురు చూస్తుంటారు దర్శక, ని ర్మాతలు. ఆమెకి అంత క్రేజ్‌.
రాశీఖన్నాని పరాజయాలు పలకరిస్తున్నకొద్దీ ఆమె తన కెరీర్‌ని మరింతగా పరుగులు పెట్టిస్తోంది. తెలుగుతోపాటు-, తమిళం, మలయాళం భాషలపై దృష్టిపెట్టి వరుసగా సినిమాలు చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌కి కొంతకాలంగా చెప్పుకోదగ్గ విజయం లేకపోయినా, కార్తికేయ2తో ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో నటిస్తున్న సీనియర్‌ భామ ల్లో ఎక్కువశాతం గతమెంతో ఘనకీర్తి కలిగిన వారే. ‘ఓ బేబీ’ తర్వాత తెలుగులో సమంతకి చెప్పుకోదగ్గ సినిమా లేదు. అయినా వరుసగా సినిమాలు చేస్తూ, ‘పుష్ప’తో వచ్చిన ప్రత్యేక గీతం అవకాశం తర్వాత మళ్లీ జోరు చూపించడం మొదలుపెట్టింది. యశోద సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేదు. ‘శాకుంత లం’ సినిమాని పూర్తి చేసిన ఆమె ‘ఖుషి’ లో నటిస్తోంది.
అనుష్క బాహుబలి చిత్రాల తర్వాత ఆమె కెరీర్‌లో వేగం తగ్గినప్ప టికీ, ‘నిశ్శబ్దం’ వంటి పరా జయం ఎదురైనప్పటికీ ఆమెకి కథలు వినిపిం చేందుకు దర్శకని ర్మాతలు వరుస క ట్టారు. ఇటీ-వలే నవీన్‌ పోలిశె ట్టితో కలిసి ఓ చిత్రం కోసం రం గంలోకి దిగింది . ‘పుష్ప’ సినిమాతో నటిగా సత్తా చాటిన రష్మిక మందన్న, ఆడవా ళ్లూ మీకు జోహార్లుతో పరాజయాన్ని చవి చూసింది. అయినా సరే, ఆమె జోరు తగ్గలేదు. హిందీలో నూ, తమిళంలో అవకాశా ల్ని సొంతం చేసుకుంది. వారసుడు ఫలితం ఉ త్సాహాన్నిచ్చిం ది. సీతా రామంతో మళ్లీ ఫామ్‌ లోకి వచ్చింది. ‘పుష్ప2’ కోసం మరోసారి శ్రీవల్లి గా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. తమ న్నాకి ఆమె అనుభవమే ఓ బ్రాండ్‌. ఎంత పోటీ- ఎదురైనా, పరా జయాలతో ఆటు-పోట్లు- ఎదురైనా ఆమెని అగ్ర పథాన నిలబెడుతోంది అనుభవమే. చిరంజీవి తో కలిసి ‘భోళాశంకర్‌’లో నటి స్తోంది.
భారీ విజయాలతో జోరు చూపించిన పూజా హెగ్డే, కీర్తిసురేష్‌లు ఈమధ్య పరాజయాల్ని చవిచూ శారు. రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌… ఇలా కొన సాగింది పూజా పరాజయాల పరంపర. ఇవేవీ ఆమె కెరీర్‌పై ప్రభావం చూపలేదంటే పూజాకి ఉన్న క్రేజ్‌ అర్థమవుతు ంది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు , త్వరలో నే మహేష్‌బాబుతో కొత్త చిత్రం మొదలు పెట్టనుంది.
కీర్తిసురేష్‌ దసరాలో నటిస్తోంది.చిరంజీవి చిత్రం భోళాశంకర్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నుంచి కథానాయికలు దిగుమతి అవుతు న్నా సీనియ ర్లు మొదలుకొని, కొత్తతరం వరకు అంద రికీ అవకాశాలు దక్కుతుండడం కథానాయికలకి కలిసొస్తున్న మరో అంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement