Friday, March 29, 2024

బుగ్గన ఆర్థిక మంత్రి కాదు.. అప్పుల మంత్రి: సీపీఐ నేత రామకృష్ణ

ఏపీ రాజధానిపై వైసీపీ మంత్రులు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులతో మాట్లాడటమే అనవసరం అని ఓ మంత్రి అంటే.. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ మరో మంత్రి వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. సీఎం జగన్ సిమ్లాకు పోతే ఏపీ రాజధాని సిమ్లా అవుతుందా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

మరోవైపు ఏపీలో ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా తయారైందని సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి కాదని.. అప్పుల మంత్రి అని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే ఆదాయానికి సహకరించడం లేదనే కలెక్టర్ గంధం చంద్రుడిని బదిలీ చేశారని విమర్శించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను చూసి ఎలా పరిపాలించాలో జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు. మరోవైపు మోదీ పరిపాలనలో అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దురదృష్టకరమన్నారు. ఈనెల 25న కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Advertisement

తాజా వార్తలు

Advertisement