Tuesday, April 23, 2024

జగన్ కు అమిత్ షా అండదండలు.. బెయిల్ రద్దు కాదు

ఏపీ సీఎం జగన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండదండలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారని… అయితే, అమిత్ షా అండ ఉన్నంత కాలం జగన్ బెయిల్ రద్దు కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు రఘురాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ కోరుతోందని… వీరిరువురి నాటకాలను అమిత్ షా చూస్తున్నారని పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని నారాయణ విమర్శించారు.

మహమ్మారి వల్ల కార్పొరేట్ ఆసుపత్రులు బాగుపడ్డాయని తెలిపారు. మోదీ పాలనలో అంబానీ, అదానీల ఆస్తులు భారీగా పెరిగాయని మండిపడ్డారు. కరోనా వల్ల చనిపోయిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వలేమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం… కార్పొరేట్లకు మాత్రం రూ. 1.60 లక్షల కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. దేశ చరిత్రలో మోదీ అంతటి దారుణమైన ప్రధాని మరొకరు లేరన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులు బానిసలు అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వాజ్ పేయి మంచి రాజకీయ నేత అని… మోదీ ఫ్యాక్షనిస్టు నేత అని విమర్శించారు. సీబీఐ, ఈసీ, ఆర్బీఐ, న్యాయ వ్యవస్థలను మోదీ డమ్మీ చేశారని నారాయణ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు.. రేవంత్ పై హరీష్ సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement