Thursday, April 25, 2024

రాహుల్ సిప్లిగంజ్ ని శాలువాతో స‌న్మానించిన.. సీపీ సీవీ ఆనంద్

నాటునాటు పాటతో హైదరాబాద్ నగర ఖ్యాతిని సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేశాడని కొనియాడారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. తన కార్యాలయంలో రాహుల్ సిప్లిగంజ్ ని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ హిందీలో ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ రాహుల్ కేవలం హైదరాబాదీ మాత్రమే కాదని.. అతను తెలుగు వ్యక్తి అని కామెంట్ చేశాడు. మాతృభాషలో అభినందించాలని కోరడంతో సీవీ ఆనంద్ తెలుగులోనూ ట్వీట్ చేశారు. మన ధూల్‌పేట్ కి చెందిన యువకుడు రాహుల్ సిప్లిగంజ్ ను నా ఆఫీసులో కలిశాను. ఇతను మన నగరం పేరు ప్రపంచంలోనే చాలా విస్తృత పరిచాడు. అది కూడా ఎక్కడా.. లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో నాటు నాటు పాట పాడి! మన అందరికీ ఇది గర్వకారణం. ఎందుకంటే ఇతను మన హైదరాబాదీ గనుక అని ఆనంద్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement