Friday, April 19, 2024

Covid Update : దేశంలో కొత్త‌గా క‌రోనా కేసులు ఎన్నంటే ?

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తుంది. గ‌త‌వారం రెండు వేల‌కు పైగా న‌మోదైన కేసులు, ప్ర‌స్తుతం వెయ్యి వ‌ర‌కు న‌మోద‌వుతున్నాయి. దేశంలో కొత్త‌గా 1,216 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,58,365కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,705 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 18 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,479కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement