Saturday, April 20, 2024

Covid Alert in India : కరోనా కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన..

ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష నిర్వమించనుంది. ఇందులో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలని అనే దానిపై చర్చించనున్నారు.

తెలంగాణ అలర్ట్‌..
కరోనాపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసుల శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని నిర్ణయించింది. తెలంగాణలో నిన్న 5 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ రోజుకు 4వేల టెస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర హెచ్చరికలతో ఏపీ సర్కార్‌ అప్రమత్తమైంది. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు అనుమానితుల శాంపిల్స్‌ సేకరించాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement