Wednesday, April 24, 2024

Covid-19 : చైనాలో కరోనా విజృంభణ… ఆందోళ‌న బాట ప‌ట్టిన ప్ర‌జ‌లు…

క‌రోనా పేరు వింటేనే ప్ర‌పంచ దేశాల వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే. ఈ వైరస్ తో ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పాయారు. ఎంతో ఆస్తి న‌ష్టం సైతం స‌భ‌వించింది. ఇప్పుడిప్పుడే అన్ని దేశాల్లో క‌రోనా వైర‌స్ క‌నుమరుగ‌వుతున్న తరుణంలో కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. చైనాలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తుండ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 40,347 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్‌ వెల్లడించింది. అందులో 3,822 కేసులు వైరస్‌ లక్షణాలతో ఉన్నట్లు తెలిపింది. 36,525 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. ఇక చైనాలో 3,11,624 కొవిడ్ కేసులు రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు కొత్త క‌రోనా ఇన్ఫెక్షన్ కార‌ణంగా 5,232 మంది చ‌నిపోయారు. చైనా ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తోంది. ‘జీరో కొవిడ్‌’ పాలసీని అమలు చేస్తూ లక్షల మంది ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. ఇప్ప‌టికే ఆర్థికంగా న‌ష్ట‌పోయిన మాకు ఇప్పుడు లాక్ డౌన్ కార‌ణంగా మ‌ళ్లీ ఇంటికే ప‌రిమిత‌మైతే బ‌తికేది ఎలా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. వీరికి ప‌లు సంఘాల నుంచి భారీగా మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. షాంఘై నగరంలో వేల మంది చైనీయులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement