Thursday, March 28, 2024

ఈ మేకల జతకు రూ.1.50 లక్షలు.

ఓ మేకుల జతకు ఎంత ఉంటుంది ఓ 25 నుంచి 30 వేల వరకు ఉంటుంది. కాని ఏకంగా లక్ష యాబైవేలకు కొనుగోలు చేశారు వ్యాపారులు..నెల్లూరు జిల్లా రాణిపేట సంతలో మేకల జతను కొన్నారు వ్యాపారులు.. ఈ సంతలో వేలూరు, తిరువణ్ణామలై, తిరువళ్లూర్‌, ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా నుంచి విక్రయానికి మేకలు తీసుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన మేకల జత రూ.50 వేల వరకు విక్రయం కాగా, నెల్లూరుకు చెందిన మేకల జత రూ.1.50 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ విషయమై నెల్లూరు వ్యాపారులు మాట్లాడుతూ, నెల్లూరు తెల్లరకం మేక బరువు 25 కిలోలు వుంటుందని, మాంసం కోసమే ఈ మేకల్ని సంరక్షిస్తున్నామన్నారు. ఈ రకం మాంసం రుచి కూడా బాగుండడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారని తెలిపారు. కాగా, రాణిపేట, వేలూరు, తిరుపత్తూర్‌ జిల్లాల్లో రెండు రోజులుగా సుమారు 20 ప్రాంతాల్లో నిర్వహించిన మేకల సంతలో రూ.25 కోట్ల విక్రయాలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు.

ఇది కూడా చదవండి : యాదాద్రిలో విరిగిపడ్డ కొండచరియలు.. తప్పిన ప్రమాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement