Friday, September 22, 2023

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

ఇల్లందు రూరల్ (ప్ర‌భ న్యూస్) : ఇల్లందు-ఖమ్మం ప్రధాన రహదారిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిడికొండ సుబ్బారావు(55), అతని భార్య లలిత(49) మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళితే.. మండల పరిధిలోని లలితాపురం గ్రామానికి చెందిన వీరిరువురు సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఇల్లందు వస్తుండగా కరెంట్ ఆఫీస్ ఏరియాలోని సుభాష్ నగర్ వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టడంతో దంపతులు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సుబ్బారావు చిరు వ్యాపారి. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. మృతి వార్త వినగానే లలితాపురం గ్రామమంతా శోకసముద్రంలో నిండిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement