Thursday, April 25, 2024

కోస్టారికా బోణి.. 1-0తో జపాన్‌ మీద గెలుపు

ఫిఫా ప్రపంచకప్‌లో కోస్టారికా జట్టు బోణి కొట్టింది. మొదటి మ్యాచ్‌లో గెలిచి ఊపు మీదున్న జపాన్‌కు షాక్‌ ఇచ్చింది. అహ్మద్‌బిన్‌ అలీ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్‌ – ఇ మ్యాచ్‌లో కోస్తారికా 1-0తో జపాన్‌ మీద గెలుపొందింది. కీషెర్‌ జపాన్‌ మీద గెలుపొందింది. కీషెర్‌ పుల్లర్‌ 81 నిమిషంలో గోల్‌ చేయడంతో కోస్తారికా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో కోస్టారికాగ్రూప్‌ -ఇలో మూడో స్థానానికి చేరింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కోస్టారికా తమ కంటే పటిష్టమైన జపాన్‌కు షాకిచ్చి గెలుపు సాధించింది.

మ్యాచ్‌ ఆరంభమైన మొదటి అర్ధ భాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్క గోల్‌ కూడా కొట్టలేదు. రెండో అర్ధ భాగంలో జపాన్‌ టీమ్‌ దూకుడుగా ఆడింది. కోస్టారికా గోల్‌ పోస్ట్‌ వైపు దూసుకొచ్చి గోల్‌ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ కోస్టారికా గోల్‌ కీపర్‌, డిఫెన్స్‌ జపాన్‌ గోల్‌ ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. తొలి మ్యాచ్‌లో కోస్టారికా జట్టు స్పెయిన్‌ చేతిలో 0-7 గోల్స్‌తో దారుణంగా ఓడిపోయింది. జపాన్‌ టీమ్‌ తమ మొదటి మ్యాచ్‌లో నాలుగుసార్లు ప్రపంచకప్‌ చాంపియన్‌ జర్మనీపై 2-1 గోల్స్‌తో గెలిచింది.
ఈ నెల 23న స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోస్టారికా 0-7 గోల్స్‌ తేడాతో ఓటమిపాలై పరాజయాన్ని మూటగట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement