Saturday, October 12, 2024

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న కేసులు..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికించింది. ఈ వైరస్ భారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సర కాలంగా దాదాపు అన్ని దేశాల్లో కరోనా కేసుల సంఖ్య 500 లోపే నమోదయ్యాయి. భారత్ లో 200 వరకు పడిపోయాయి. ఇప్పుడిప్పుడే కరోనా భారినుంచి ఆర్థికంగా కోలుకుంటున్న తరుణంలో మళ్లీ చైనాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలకు మళ్లీ గుబులు పట్టుకుంది. చైనాలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క శుక్ర‌వారం రోజునే 35,183 కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో 3,474 కేసులు కొవిడ్-19 ల‌క్ష‌ణాలతో ఉన్నాయి. 31,709 మందిలో కరోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌లేదని చైనా ఆరోగ్య శాఖ క‌మిష‌న‌ర్ తెలిపారు. గురువారం 32.943 కేసులు న‌మోద‌య్యాయి. శుక్ర‌వారం వ‌ర‌కు చైనాలో 3,04,093 కొవిడ్ కేసులు రికార్డు అయిన్ట‌టు అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement