Thursday, April 25, 2024

కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రెడీ: తెలంగాణ DH

తెలంగాణలో క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టుకు రాష్ట్ర ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాసరావు నివేదిక స‌మ‌ర్పించారు. ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి రోజుకు స‌రాస‌రి ల‌క్ష క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 66,79,098 టీకా డోసులు ఇచ్చామ‌న్నారు. ఆస్ప‌త్రుల్లో ఇన్ పెషేంట్లు త‌గ్గుతున్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 36.50 శాతం, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో 16.35 శాతం ప‌డ‌క‌లు నిండాయ‌న్నారు.

క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని DH శ్రీనివాసరావు తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 10,366 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు ఏర్పాటు చేశామ‌ని పేర్కొన్నారు. మిగ‌తా 15 వేల ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ఆస్ప‌త్రుల్లో 132 ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కేంద్రాల ఏర్పాటుకు అనుమ‌తిచ్చామ‌న్నారు. నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో మ‌రో వెయ్యి ప‌డ‌క‌లు సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో పిల్ల‌ల చికిత్స‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్ల‌ల కోసం 4 వేల ప‌డ‌క‌లు సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. సిబ్బంది పెంపు, శిక్ష‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement