Tuesday, April 16, 2024

కవిత భర్తకు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అల్లుడు కవిత భర్త అనిల్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. స్వయంగా ఈ విషయాన్ని కవిత ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

నా భర్త అనిల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతను హోమ్ క్వారంటైన్ లో ఆరోగ్యంగానే ఉన్నారు. అతని తో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాము. కాబట్టి ప్రస్తుతం ఎవరిని కలవ లేము. ఇక మీటింగ్స్ అన్నీ కూడా రీ షెడ్యూల్ చేస్తామని కవిత ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement