Saturday, April 10, 2021

సీఎస్ కు కరోనా… కెసిఆర్ కొంపముంచేనా !!

తెలంగాణలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

కాగా సోమేష్ కుమార్ కొన్ని గంటల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమేశ్ కుమార్ ను కలిసిన వారంతా కూడా భయాందోళన చెందుతున్నారు. సి ఎస్ ను కలిసిన వారంతా కూడా కరోనా టెస్టుల్లో చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Prabha News