Monday, March 25, 2024

దేశంలో కొత్తగా 1.31 లక్షల పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య  ప్రజల్ని హడలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,31,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 780 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9.74 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 61,899 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరుకు కరోనా కారణంగా 1,67,642 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 9,43,34,262 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

నిన్న మహారాష్ట్రలో 56,286 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఛతీస్‌గడ్‌లో 10,652 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 8474, ఢిల్లీలో 7437, కర్నాటకలో 6570, కేరళలో 4353 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కరోనా కేసులు ప్రతీ రోజూ పెరుగుతోన్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement