Thursday, April 25, 2024

కరోనాలో కొత్త వేరియంట్ గుర్తింపు: WHO

కరోనా లో మరో వేరియంట్ వచ్చిందని WHO తెలిపింది. lambda అనే కొత్త వేరియంట్ ని 29 దేశాల్లో గుర్తించారు. ముఖ్యంగా సౌత్ అమెరికా లో ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. మొట్టమొదటి ఈ కోవిడ్ వేరియంట్ ని పెరూలో గుర్తించారు.పెరూలో లాంబ్డా ప్రబలంగా ఉంది, ఇక్కడ ఏప్రిల్ 2021 నుండి 81 శాతం COVID-19 కేసులు ఈ వేరియంట్‌తో సంబంధం కలిగి ఉన్నాయని అధికారులు నివేదించారు.ఇది ఇలా ఉండగా చిలీలో, గత 60 రోజుల లో పరిశీలించిన దాని ప్రకారం 32 శాతం ఉందని కనుగొనబడింది మరియు బ్రెజిల్‌లో మొట్టమొదట గుర్తించబడిన గామా వేరియంట్‌తో మాత్రమే ఇది అధిగమించబడింది.

అర్జెంటీనా మరియు ఈక్వెడార్ వంటి ఇతర దేశాలలో కూడా కొత్త వేరియంట్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. లాంబ్డా వలన వైరస్ యొక్క శక్తి మరెంత పెరగొచ్చు అని WHO అంటోంది. కానీ పూర్తిగా దీని కోసం ఇంకా ఏమి తెలియలేదు. మరెంత రీసర్చ్ అవసరం అని నిపుణులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement