Saturday, April 20, 2024

కరోనా కొత్తకేసులు వెయ్యి దిగువనే..

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. రోజువారి కేసులు 1000కి చేరువలోనే ఉంటున్నాయి. తాజాగా 2.7 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వ‌హించ‌గా, 861 మందికి వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. గడచిన 24 గంటల వ్యవధిలో కేవలం ఆరుగురు మాత్రమే మరణించారు. శనివారం ఈ సంఖ్య 29గా ఉంది. ఆదివారం ఒక్కరోజే 929 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 11,058కి తగ్గాయి.

ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతుండగా.. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆదివారం 2.4 లక్షల మంది టీకా తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోసు కూడా అందిస్తున్నారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 185 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని సోమవారం కేంద్రం వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement