Saturday, April 20, 2024

ఇకపై పాఠ్య‌పుస్త‌కాల్లో క‌రోనా పాఠాలు..

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా ఇకపై బడుల్లో పాఠ్యాంశంగా రానుంది. మన దేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా దేబ్బకు కుదేలయ్యాయి. ఆర్థికంగా నిల‌దొక్కుకున్న దేశాలు సైతం క‌రోనా ధాటికి విలవిల్లాడాయి. క‌రోనా ఎలా వ‌స్తుంది. దాని వ‌ల‌న వ‌చ్చే ఇబ్బందులు ఎంటి? క‌రోనా అంటే ఎంటి… ఎలా ఒక‌రి నుంచి మ‌రోక‌రికి సోకుతుంది… క్వారంటైన్‌, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు త‌దిత‌ర విష‌యాల‌ను విద్యార్థుల‌కు బోధించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్ద‌మైంది. 11 వ త‌ర‌గ‌తిలోని హెల్త్ అండ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ స‌బ్జెక్ట్‌లో పాఠ్యాంశంగా బోధించ‌నున‌న్నారు. 11 వ త‌ర‌గ‌తికి మాత్ర‌మే కాకుండా, 6 లేదా 7 త‌ర‌గ‌తుల నుంచే ఈ క‌రోనా పాఠాల‌ను బోధించాల‌ని కొంత‌మంది నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. దీనిపై త్వ‌ర‌లోనే వెస్ట్ బెంగాల్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోనున్న‌ది.

ఇది కూడా చదవండి: అలర్ట్: నేడు, రేపు భారీ వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement