Saturday, December 7, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట: కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 15 రోజుల లీవ్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. వారికి 15 రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్ (ఎస్‌సీఎల్‌)ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు చెందిన తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కోవిడ్ బారిన పడితే వారికి 15 రోజుల పాటు ఆ సెలవు ఇస్తారు. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే స్వయంగా కోవిడ్ బారిన పడితే 20 రోజుల పాటు ఆ సెలవును అందిస్తామని తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement