Thursday, April 25, 2024

చిన్నారులు, గర్భిణుల్లో కరోనా ఇన్‌ఫెక్షన్లు.. ఐదేళ్లలోపు వారిలో అధికం..

చిన్నారుల్లో కరోనా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యులు దీన్ని నిర్ధారించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐసీడీ)కి చెందిన వైద్యులు వాసిలా జస్సాత్‌ మాట్లాడుతూ.. గతంలో కరోనా మహమ్మారితో పిల్లలు పెద్ద ప్రభావితం కాలేదు. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఎదురుకాలేదు. అవన్నీ మనం చూశాం. మూడో వేవ్‌లో మాత్రం ఐదేళ్లలోపు పిల్లలు, 15 నుంచి 19 ఏళ్ల లోపువారిలో ఆస్పత్రిలో చేరిక ఎక్కువగానే కనిపించింది.

ప్రస్తుతం మేం నాలుగో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం. అన్ని వయస్సుల వారితో పాటు మరీ ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముందుగా ఊహించినట్టుగానే.. ఆ రేటు తక్కువగానే ఉన్నప్పటికీ.. 60ఏళ్లు పైబడిన వ్యక్తుల తరువాత ఐదేళ్లలోపు వారిలోనే ఈ చేరిక అధికంగా ఉంది. ఈ తీరు గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఉంది. చిన్నారులు, గర్భిణుల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు పెరగడానికి గల కారణాలను అనేషిస్తున్నాం. కొత్త వేరియంట్‌ లక్షణాలు సల్పంగానే ఉన్నా.. వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement