Friday, April 19, 2024

శ్రీచైతన్యలో కరోనా కలకలం..

కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే స్కూల్స్ ఓపెన్ చేయడానికి అనుమతినిచ్చాయి ప్రభుత్వాలు. అయితే ఇలా స్కూల్స్ ఓపెన్ చేశారో లేదో అలా కరోనా విద్యార్థులపై పంజా విసురుతోంది. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్కూల్‌ను వచ్చేనెల 20 వరకు మూసివేశారు. ఆదివారం సాయంత్రం శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన ఓ విద్యార్థి వామ్‌టింగ్ చేసుకున్నట్లు, డైయేరియాతో ఇబ్బందిపడుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. వెంటనే తారు ఆ క్యాంపస్‌లో ఉన్న మొత్తం 480 మందికి పరీక్షలు నిర్వహించామని, అందులో 60 మందికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు.

అయితే పాజిటివ్‌గా తేలిన వారిలో ఇద్దరిలోనే లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరో వారం రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైరస్ సోకినవారిలో 46 మంది కర్ణాటకు చెందినవారుకాగా, మిగిలిన 14 మంది తమిళనాడుకు చెందినవారని తెలిపారు. శ్రీచైతన్య రెసిడెన్సియల్ స్కూల్‌ను నెలరోజుల క్రితమే పునఃప్రారంభించారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Advertisement

తాజా వార్తలు

Advertisement