Sunday, May 9, 2021

ICSE పరీక్షలు వాయిదా – కరోనా ఎఫెక్ట్

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభం అయిన నేపధ్యంలో అన్ని రకాల పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ICSE పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ICSE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ CISCE బోర్డు నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణక సంబంధించిన కొత్త తేదీలను జూన్ తొలివారంలో ప్రకటిస్తామని CISCE బోర్డ్ తెలిపింది.

కాగా కరోనా నేపథ్యంలో CBSE టెన్త్ , ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయగా.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ICSE పరీక్షలు వాయిదా - కరోనా ఎఫెక్ట్
Advertisement

తాజా వార్తలు

Prabha News