Sunday, December 8, 2024

క‌రోనా విజృంభ‌ణ వేళ పన్నులు వసూలు చేయడం అత్యంత క్రూరం: ప్రియాంక

క‌రోనా విజృంభ‌ణ వేళ క‌రోనా ఔష‌ధాలు, సామగ్రిపై వస్తు సేవల పన్నును తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. క‌రోనా వేళ దాన్ని క‌ట్ట‌డికి ఉప‌యోగ‌ప‌డే వ‌స్తువులు, ఔష‌ధాల‌పై జీఎస్టీ ఉండ‌డం ఏంట‌ని నిల‌దీశారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఆల్కహాల్  హ్యాండ్ శానిటైజర్లు, స‌బ్బులు, కాటన్ మాస్క్, పీపీఈ కిట్స్, వ్యాక్సిన్, రెమ్‌డెసివిర్, వెంటిలేటర్లు, కృత్రిమ శ్వాస పరికరాలపై జీఎస్‌టీ విధిస్తున్నారని ఆమె మండిప‌డ్డారు. క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతోన్న ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం అత్యంత క్రూర‌మ‌ని ఆమె విమ‌ర్శించారు.
కేంద్ర ప్ర‌భుత్వం బాధితుల‌పై ఏ మాత్రం జాలి లేకుండా వ్యవహరిస్తోంద‌ని చెప్పారు. కాగా, ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ నేతృత్వంలో 43వ జీఎస్‌టీ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement