Thursday, May 6, 2021

యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో కరోనా కలకలం..ఆర్జిత సేవలు బంద్

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో విజృంభిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలోని ప్రముఖ దేవస్థానం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో పనిచేసే సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

దీంతో ఇతరులకు అది వ్యాప్తి చెందకుండా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో అధికారికంగా ప్రకటించారు. 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు అధ్యక్ష సేవలను పూర్తిగా రద్దు చేశామని ఏకాంతంగా స్వామివారికి ఆర్జిత సేవలు జరుపుతామని తెలిపారు. భక్తులాంత కూడా సహకరించాలని ఈవో కోరారు.

యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో కరోనా కలకలం..ఆర్జిత సేవలు బంద్
Advertisement

తాజా వార్తలు

Prabha News