Wednesday, June 16, 2021

తెలంగాణ లో భారీగా తగ్గిన కరోనా కేసులు…1798 కొత్త కేసులు

తెలంగాణలో భారీ స్థాయిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో కొత్తగా 1,30,430 కరోనా పరీక్షలు చేయగా…. కొత్తగా 1,798 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అలాగే ఈ మహమ్మారి కారణంగా 14 మంది మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 2,524 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 23,561 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,98,611కు చేరింది. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,71,610కి పెరిగింది. అలాగే మొత్తం కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,440కి చేరింది. తాజా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 174, ఖమ్మం 165, నల్గొండ 151, సంగారెడ్డి 107 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News