Saturday, April 20, 2024

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు @టుడే అప్డేట్

తెలంగాణ లో కరోనా కేసులు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,933 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మ‌రో 16 మంది క‌రోనా తో మృతి చెందారు. మరోవైపు గ‌డిచిన‌ 24 గంట‌ల్లో 3,527 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కాగా కరోనా కట్టడి నేపధ్యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్‌ భేటీ రేపు జరగనుంది. క‌రోనా తాజా ప‌రిస్థితి, వ్యాక్సినేష‌న్ త‌దిత‌ర‌ల అంశాలు అలాగే లాక్‌డౌన్ పై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement