Friday, April 19, 2024

గాల్లో వేగంగా వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్..వియత్నాంలో గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక ఇప్పటివరకు కొన్నివేల మ్యుటేషన్లను గుర్తించారు. వారిలో చాలావరకు ఏమంత ప్రమాదకరం కాదు. కొన్నిమాత్రం అధికంగా వ్యాప్తిచెందుతూ ప్రజల ఆరోగ్యం పాలిట ఆందోళనకరంగా పరిణమిస్తుంటాయి. తాజాగా గాల్లో వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్ ను వియత్నాంలో కనుగొన్నారు. భారత్, బ్రిటన్ లో కనిపించిన వేరియంట్ల కలయికగా కనిపిస్తున్న ఈ కొత్త వేరియంట్ ను వియత్నాం పరిశోధకులు గుర్తించారు. వియత్నాంలో ఈ వైరస్ కొంతమందికి సోకినట్టు వెల్లడైంది.

మిగిలిన కరోనా వైరస్ వేరియంట్ల కంటే ఇది అమితవేగంతో వ్యాపిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇది గాల్లో కూడా అధికవేగంతో వ్యాపిస్తున్నందున ఈ మ్యుటేషన్ ఎంతో ప్రమాదకరమైనదని భావిస్తున్నామని వారు తెలిపారు. వియత్నాంలోని 30 ప్రావిన్స్ లలో 63 మున్సిపాలిటీల పరిధిలో ఈ కొత్త వేరియంట్ ఉనికి వెల్లడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement