Friday, May 20, 2022

త్రోబాల్‌ ఛాంప్‌ ట్రోఫికి సహకరిస్తాం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ స్థాయిలో జరగనున్న త్రోబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ ట్రోఫికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తామని క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో 27వ జాతీయ త్రోబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ వాల్‌ పోస్టర్‌, ట్రోఫి, జెర్సీలను ఆయన ఆవిష్కరించారు. జాతీయ త్రోబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ క్రీడలు సికింద్రాబాద్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ సఫిల్‌గూడలో మే 28 నుంచి 30 వరకు జరగనున్నాయి.

మొత్తం 23 రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ అల్లిdపురం వెంకటేశ్వర రెడ్డి, హ్యాండ్‌ బాల్‌ జాతీయ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు, త్రోబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement