Friday, March 29, 2024

హైదరాబాద్‌లో ఏకధాటిగా వర్షం.. పలు కాలనీలు జలమయం

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు నగరంలో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కమలానగర్‌ తదితర ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. సరూర్‌నగర్‌ చెరువులోకి భారీగా వరద చేరడంతో చైతన్యపురి పరిధిలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఎల్బీనగర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నీరు ఎక్కువగా నిలిచిన చోట మోటార్ల ద్వారా పంపింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాయి.

బుధవారం రాత్రి 8:30 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) వెల్లడించింది. అత్యధికంగా నాగోల్‌ బండ్లగూడలో 21.2 సె.మీ, ప్రశాంత్‌నగర్‌లో 19.2 సె.మీ, హస్తినాపురంలో 19 సె.మీ, సరూర్‌నగర్‌లో 17.9సె.మీ, హయత్‌నగర్‌లో 17.1 సె.మీ వర్షపాతం నమోదైంది.

ఈ వార్త కూడా చదవండి: కేటీఆర్, సంతోష్‌లపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement