Thursday, March 30, 2023

Breaking: వరంగల్ లో కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్య

కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటిపై ఖాకీ బట్టలు వేసుకుని సమాజ సేవ చేయాలనే ఆశయ సాధనలో ఓటమి పాలయ్యానని కుంగిపోయిన అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం సింగారంకు చెందిన జక్కుల రాజ్ కుమార్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మూడు మార్కులు తక్కువ వచ్చాయనే మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కన్నకొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement