కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై నిరసనకు దిగారు. సంగారెడ్డికి వైద్య కళాశాల కేటాయించాలని, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆయన చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే తన నియోజక వర్గంలో 40 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, అభివృద్ధికి రూ.2వేల కోట్లు మంజూరు చేయాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద తన కుమార్తె జయారెడ్డితో కలిసి నిరసనకు దిగారు. సంగారెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. అయితే ప్లకార్డులకు అనుమతి లేదని అసెంబ్లీ దగ్గర మార్షల్స్ జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆయన బైఠాయించి నిరసన తెలిపారు.
కూతురితో కలిసి జగ్గారెడ్డి నిరసన

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement