Thursday, April 18, 2024

రూ.300కోట్లు సంపాదిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది-అప్పుల‌న్నీ తీర్చేస్తా-క‌మ‌ల్ హాస‌న్

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ చిత్రం రూ.300కోట్లు సాధించింది. కాగా తాను గ‌తంలోనే ఈ విష‌యాన్ని చెప్పాన‌న్నారు క‌మ‌ల్ హాస‌న్.తంలో తాను చెపితే ఎవరూ నమ్మలేదని, కనీసం తన మాటలను అర్థం కూడా చేసుకోలేదని కమల్ చెప్పారు. ‘విక్రమ్’ సినిమా వసూళ్లతో ఇప్పుడు తన మాట నిజమైందని అన్నారు. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో తన అప్పులన్నింటినీ తీర్చేస్తానని చెప్పారు. తనకు ఇష్టమైన ఆహారాన్ని తింటానని అన్నారు. కుటుంబానికి, సన్నిహితులకు చేతనైనంత సాయం చేస్తానని చెప్పారు. డబ్బులు అయిపోయాక ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదని చెపుతానని అన్నారు. ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని పక్కవాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement