Thursday, April 18, 2024

బాపూ మ్యూజియం అభివృద్ధికి నిధులిచ్చాం.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని బాపు మ్యూజియం అభివృద్ధికి నిధులిచ్చామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్‌లో వైసీపీ లోక్‌సభ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నలకు సోమవారం ఆయన సమాధానమిచారు. విజయవాడలోని బాపు మ్యూజియం పటిష్టత, ఆధునికీకరణ, అభివృద్ధి కోసం మ్యూజియం గ్రాంట్ పథకం కింద ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం అంటే రూ. 6.4 కోట్లు మంజూరు చేసి విడుదల చేసినట్లు కిషన్ రెడ్డి వివరించారు.

నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న మ్యూజియంను 2020 అక్టోబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని వివరించారు. మ్యూజియంలోని ఏడు గ్యాలరీలలో చారిత్రక వస్తువులు, నాణేలు, శాసనాలు, వస్త్రాలు, చిత్రాలు ఉన్నాయని చెప్పారు. థియేటర్‌తో పాటు అధునాత టెక్నాలజీతో మ్యూజియంలో ఏర్పాట్లు చేసినట్టు కేంద్రమంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement