Friday, April 19, 2024

రొమాంటిక్ సీన్స్-బూతు డైలాగ్స్ తో నిండిపోయిన క‌మిట్మెంట్ ట్రైల‌ర్

క‌మిట్మెంట్ ఈ ప‌దం ఎక్కువ‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా ఈ ప‌దాన్ని టైటిల్ గా పెట్టి సినిమాని తెర‌కెక్కించారు. కమిట్ మెంట్ చిత్రానికి లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ .. ఎఫ్3 ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై భల్ దేవ్ సింగ్ – నీలిమ నిర్మించారు. నరేష్ కుమారన్ సంగీతం సమకూర్చగా.. సజీష్ రాజేంద్రన్ – నరేష్ రానా సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ తెలుగమ్మాయి తేజస్వి మదివాడ – అన్వేషి జైన్ – సీమర్ సింగ్ – తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. లవ్ – డ్రీమ్ – హోప్ – ఫైట్ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

ఆగస్ట్ 19న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషులన్న సంగతే మర్చిపోతున్నారు.. కాస్త మనుషుల్లా ఆలోచించండి’ అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి ట్రైలర్ అంతా హాట్ రొమాంటిక్ సీన్స్ – గాఢమైన లిప్ లాక్స్ – బూతు డైలాగ్స్ తో నిండిపోయింది. ఇందులో హాట్ ఫోటో షూట్స్ తో అవకాశాల కోసం ట్రై చేస్తున్న అప్ కమింగ్ యాక్ట్రెస్ గా తేజస్వి ని పరిచయం చేసారు. ఐదుగురు అమ్మాయిల జీవితంలో జరిగిన సంఘనటల సమాహారంగా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే కమిట్మెంట్ చుట్టూనే కథంతా నడుస్తుందని అర్థం అవుతుంది. ఇందులో అమిత్ తివారి – రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement